బడ్డీ కొట్టు నడుపుతున్న మహిళపై వ్యక్తి దాడి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పెనుబల్లి పోలీసులు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ లో మహిళ పై దాడి చేసిన సంఘటన సంఘటన గురువారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. పెనుబల్లి మండలం లంక సాగర్ గ్రామంలో తన ఇంటి ముందు కిరాణా కొట్టు నడుపుకుంటున్న నాగమణి అనే మహిళ పై ఎదురుగా ఉంటున్న నరసింహారావు అనే వ్యక్తి ఇనుప రాడ్డుతో దాడి చేశాడు..దీంతో ఆ మహిళ తలకు రెండు చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.తలపై రాడ్డుతో దాడి చేసే సమయంలో రెండు చేతులు అడ్డుపెట్టుకోవటం తో రెండు చేతులు విరిగిపోయ్యాయి.