పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది.. మల్లాపూర్ గ్రామానికి చెందిన గంధం నారాయణ అనే వ్యక్తి, శుక్రవారం ఉదయం పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లి, విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.. ఉదయం అని వెళ్లి వ్యక్తి మధ్యాహ్నం అయిన ఇంటికి రాలేదు. పోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా, విగతజీవిగా పడి ఉన్నాడు... ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసిన అప్పటికే మృతి చెందాడు.. ఈ ఘటనపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు... మృతుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు..