శ్రీకాకుళం జిల్లా పలాస టిడిపి కార్యాలయం ఆవరణలో ఆదివారం స్త్రీ శక్తి విజయోత్సవ సభను ఎమ్మెల్యే గౌతు శిరీష ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. గత వైకాపా ప్రభుత్వంలో రాష్ట్రం అధోగతి పాలయిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పునర్నిర్మాణం చేపట్టిందని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సూపర్ సిక్స్ లో భాగంగా.స్త్రీ శక్తి ( ఉచిత బస్సు సౌకర్యాన్ని) మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. గడిచిన సంవత్సరకాలంలో పలాస నియోజకవర్గ పరిధిలో రూ.520 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు.