కాణిపాకం: ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ద్వజారోహణం కార్యక్రమం ఆలయ యువ ఈవో శ్రీ పెంచల కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేదపండితులు మంత్రోచ్ఛరణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి విశిష్టతను భక్తులకు వివరిస్తూ ధర్మసూత్రాలను వివరించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో పెంచల కిషోర్ మీడియాతో మాట్లాడుతూ – “భక్తుల రాకకు అన్ని విధాలా ఏర్పాట్లు పూర్తి చేశాం. బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతిరోజూ ప్రత్యేక సేవలు, ఉ