తప్పుడు ప్రచారాలకు, కుట్రలకు కేరాఫ్ అడ్రస్ గా వైసీపీ నాయకులు నిలిచారని, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు. శనివారం సాయంత్రం 5గంటలకు అమరావతి ఎన్టీఆర్ భవన్ నుంచి ఎమ్మెల్యే చింతమనేని మీడియా సమావేశం నిర్వహించి వైసీపీ నేతల పై, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పై విమర్శలు చేసారు. గత రెండు రోజులుగా నియోజకవర్గం లో జరుగుతున్న సంఘటనలను చింతమనేని వివరించారు.