చత్తీస్గడ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్, దంతేవాడ పరిధిలో మావోయిస్టులు అమర్చిన మందు పాతర పేలి నేడు గురువారం రోజున ఉదయం ములుగు (జి) తాడ్వాయి (మం) భూపతిపురంకు చెందిన కానిస్టేబుల్ ఆలం మునేష్ తీవ్రంగా గాయాల పాలై రెండు కాళ్లు కోల్పోయాడు. సిఆర్పిఎఫ్ 195 బెటాలియన్ కంపెనీకి చెందిన మునేష్ నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ కార్యక్రమంలో భాగంగా మందు పాతరలు తొలగించేందుకు వెళ్లిన క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జవాన్లను మెరుగైన చికిత్స కోసం రాయపూర్ ఆస్పత్రికి తరలించారు.