ఆంధ్రప్రదేశ్‌కు పర్యాటక రాజధానిగా పేరొందిన విశాఖపట్నం, ఇప్పుడు అడ్వెంచర్ ప్రియులకు కొత్త అనుభూతులను అందిస్తోంది. ప్రత్యేకించి రుషికొండ బీచ్‌లో ఇటీవల పునఃప్రారంభమైన స్కూబా డైవింగ్ పర్యాటక రంగంలో సరికొత్త ఆకర్షణగా నిలుస్తోంది. సముద్ర గర్భంలోని అద్భుతాలను వీక్షించేందుకు ఇక్కడ ఏర్పాటు చేసిన డైవింగ్ కార్యక్రమాలు పర్యాటకులను, ముఖ్యంగా యువతను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివారం రుషికొండ బీచ్‌లో స్కూబా డైవింగ్ అలరించింది.అమెరికాకు చెందిన ప్రముఖ స్కూబా డైవ్ మాస్టర్ జెస్సీకామన్నా వంటి నిపుణులు సైతం రుషికొండ తీరం డైవింగ్‌కు అత్యంత అనువైనదని ప్రశంసించారు.