రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న పలు మార్కెట్ యార్డ్ చైర్మన్ ల పదవులను భర్తీ చేస్తూ గురువారం సాయంత్రం రాష్ట్ర టిడిపి కార్యాలయం నుండి ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో భాగంగా ప్రొద్దుటూరు టిడిపి నాయకులు, మాజీ కౌన్సిలర్, శ్రీరామ్ నగర్ పద్మశాలియ సంఘం అధ్యక్షులు వద్ది బాలుడు సతీమణి వద్ది సురేఖను ప్రొద్దుటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా నియమించారు. ఈ సందర్భంగా తమపై నమ్మకం ఉంచి మార్కెట్ యార్డ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించిన నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వద్ది దంపతులు కృతజ్ఞతలు తెలియజేశారు.