భారీ వర్షాల మూలంగా ఇల్లు కూలిపోయిన వారికి వెంటనే ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలని సిపిఎం పార్టీ వర్ని ఏరియా కార్యదర్శి నన్నే సాబ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు మోస్రా తహసీల్దార్ కార్యాలయం ఎదుట సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేసి మండల రెవెన్యూ ఇన్స్ పెక్టర్ నాగమణికి వినతి పత్రం అందజేశారు. భారీ వర్షాలకు ధ్వంసం అయిన నిరుపేదల ఇండ్లను గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతో నిరుపేదలు నష్టపరిహారాన్ని ఓల్పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మండలంలో ధ్వంసమైన ఇండ్లను గుర్తించి ప్రభుత్వానికి నివేదిక ప