బంగారుపాల్యం మండలంలోని చెన్నై–బెంగళూరు ఎక్స్‌ప్రెస్ హైవేలో జయంతి వద్ద బ్రిడ్జ్ పనులు చేస్తూ, ఇనుప కడ్డీలు ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలకు తగలడంతో బీహార్‌కు చెందిన బబ్లు కుమార్ (19) కిందపడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. పలమనేరు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడని తండ్రి సురేంద్ర రాయ్ ఫిర్యాదు మేరకు చేయడం జరిగిందని సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు.