సాలూరు నియోజకవర్గంలోని మెంటాడ మండలంలో ఉన్న ఆండ్ర పోలీస్ స్టేషన్ ను బొబ్బిలి డిఎస్పీ భవ్య రెడ్డి సోమవారం తనిఖీ చేశారు. ఆమె పోలీస్ స్టేషన్లో పెండింగ్లో ఉన్న కేసులు వివరాలతో పాటు ఇతర రికార్డులను పరిశీలించారు. త్వరగా కేసులు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు, సలహాలు ఆండ్ర ఎస్ఐ సీతారాం, గజపతినగరం సిఐ జీవీ రమణ కు అందించారు. అలాగే వివిధ సారా కేసులలో పట్టుబడి, స్టేషన్ ఆవరణలో ఉన్న వాహనాలు కూడా పరిశీలించారు.