కాకినాడ : ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా స్థానిక పెన్షనర్స్ భవన్ లో అధ్యక్షుడు కె. పద్మనాభం అధ్యక్షతన గురుపూజోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యాతిధులుగా ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ,ఉమర్ అలీషా రూరల్ డవలెప్మెంట్ సొసైటీ అధ్యక్షుడు డా.ఉమర్ ఆలీషా హాజరై 7గురు విశ్రాంత ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు.అనంతరం సెప్టెంబర్ నెలకు సంబంధించి నెలవారీ సమావేశం నిర్వహించారు.సంఘ కార్యక్రమాలలో అత్యుత్తమ సేవలు అందించిన వారికి ప్రసంశపత్రాలు అందించారు.. పలు అంశాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో పి.వెంకట్రావు,జగదాంబ, శేషగిరి, సుజాత, సంఘ సభ్యులు పాల్గొన్నారు.