సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం తొగర్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ ప్రావీణ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి చదువు తీరుతెన్నులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు. 100% ఉత్తీర్ణత సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలని ఆమె ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దశరథ కూడా పాల్గొన్నారు.