రెండు పడకల గృహాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పట్టణ కార్యదర్శి శంభు అన్నారు. ఆదివారం నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి వాడలో ఉన్న డబల్ బెడ్ రూమ్లను సందర్శించారు. అక్కడ ప్లంబింగ్ లీకేజీలు ఉన్నాయని తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నాణ్యత లేకుండా నిర్మాణాలు చేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కురుస్తున్న వర్షాలకు గోడలు నాని నిత్యవసర వస్తువులు పాడవుతున్నాయని తెలిపారు.