కోడూరులో విజిలెన్స్ & ఎన్ఫోర్స్మెంట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఒమర్, మండల వ్యవసాయ అధికారి ఎం. శ్రీధర్ ఆధ్వర్యంలో ఎరువుల షాపుల్లో తనిఖీలు జరిగాయి. లక్ష్మి వెంకటేశ్వర మేన్యూర్స్ డిపో ఎరువుల డీలరు వద్ద బిల్లు బుక్కులు, స్టాక్ రిజిస్టర్, ఈ పాస్ మెషిన్ గ్రౌండ్ బాలన్స్ సరిపోలేదు. దీంతో ఆదివారం రూ. 2 లక్షల విలువైన 13 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేశారు.