భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని జిల్లా కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు మెయిన్ రోడ్ గుండా ర్యాలీ నిర్వహించి అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు నరహరి హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తుందని అన్నారు. వెంటనే విద్యార్థులకు రూ.8650 ఫీజు నెంబర్స్ విడుదల చేయాలని అన్నారు.