హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హయత్ నగర్ నుంచి తొర్రూర్ కు వెళ్లే ఒక ఆటో ముందు చక్రం విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళలను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.