ప్రకాశం జిల్లాలో విధులు నిర్వహిస్తూ వివిధ కారణాలతో మరణించిన, రిటైర్ అయిన పోలీసు సిబ్బంది కుటుంబాలకు, మరియు హోం గార్డులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ దామోదర్ అన్నారు. సమర్థవంతమైన పోలీసింగ్‌తో పాటు సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని, సమాజ రక్షణలో ప్రాణాలర్పించిన సిబ్బందిని పోలీస్ శాఖ ఎప్పటికీ మరచిపోదన్నారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో మరణించిన మరియు రిటైర్ అయిన పోలీసు సిబ్బంది కుటుంబాలతో, హోమ్ గార్డ్స్ వారి యొక్క సంక్షేమం కొరకు జిల్లా ఎస్పీ సమావేశం నిర్వహించినారు.