గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో డ్రైన్లలో వ్యర్ధాలు తీయడానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన ర్యాంప్ లను వార్డ్ సచివాలయాల వారీగా తక్షణం తొలగించాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు పట్టణ ప్రణాళిక అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం నగరంలోని పట్నం బజార్, ఏలూరు బజార్ తదితర ప్రాంతాల్లో డ్రైన్లపై ర్యాంప్ లను, శ్రీనివాసరావు తోట ప్రాంతంలో డ్రైన్లలో పేరుకున్న వ్యర్ధాలను, పీకల వాగు పక్కన చెత్త డంపింగ్ ను, చౌడవరంలోని రాజీవ్ గృహకల్ప ప్రాంతాన్ని పరిశీలించి, సంబందిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.