ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఇచ్చోడలోని కేశవపట్నంలో 160 మంది సిబ్బందితో భారీ కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన ధ్రువపత్రాలు లేని 82 ద్విచక్ర వాహనాలు, 18 ఆటోలు, ఒక మ్యాక్స్ వాహనాన్ని తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నారు. నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో గంజాయి కోసం కూడా తనిఖీలు చేపట్టారు. తల్లిదండ్రులు యువతను చదువుకునేలా ప్రోత్సహించాలని, చదువుతోనే భవిష్యత్తు, మంచి పేరు లభిస్తుందని ఎస్పీ సూచించారు