ప్రకాశం జిల్లా దోర్నాల పట్టణంలోని స్థానిక సుందరయ్య కాలనీలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా హిందువులు ముస్లింలు కలిసి వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం కులమతాలకతీతంగా గణేష్ ని ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు.భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు