గచ్చిబౌలిలో ఎమ్మెల్యే రాజాసింగ్ గురువారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటే కాంగ్రెస్ నాయకుడు మెట్టు సాయి సీఎం ఆకారంలో విగ్రహం నెలకొల్పడం ఏంటి అని ప్రశ్నించారు. తాను ఫిర్యాదు చేస్తే అక్కడ మరో విగ్రహం ఏర్పాటు చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఏమైనా దేవుడా అని ఆయన అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసిన మెట్టు సాయిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.