తిరుపతి-పుత్తూరు హైవేపై గురువారం చెట్లకు నీళ్లు పడుతున్న ట్యాంకర్‌ను టిప్పర్ ఐచర్ బండి ఢీకొన్న ఘటనలో పున్నేరు గ్రామానికి చెందిన డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.