సంగారెడ్డి పట్టణంలోని ఎల్బీనగర్ లోని వరద ప్రభావిత ప్రాంతంలో సీపీఎం ఏరియా కార్యదర్శి యాదగిరి నేతృత్వంలోని బృందం గురువారం పర్యటించింది. స్థానికులతో మాట్లాడి, వర్షపు నీరు ఎలా వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ, వర్షం వచ్చినప్పుడు మాత్రమే కాకుండా, శాశ్వత పరిష్కార చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఇతర నాయకులు కూడా పాల్గొన్నారు