అనుమానాస్పద స్థితిలో టిటిడి ఉద్యోగ మృతి చెందిన ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. కపిలతీర్థం టిటిడి ఏఈఓ గా పనిచేస్తున్న కోనేటి సుబ్బరాజు గా పోలీసులు గుర్తించారు. ఆయన భార్య సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రుయా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అలిపిరి పోలీసులు కేసు నమోదు చేయనున్నారు.