ఆదిలాబాద్లో ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. ఈ ఎన్నికల్లో శ్రీనివాస్ రావు అధ్యక్షుడిగా, దత్తు ప్రధాన కార్యదర్శిగా, కిరణ్ ఉపాధ్యక్షుడిగా, శ్రీనివాస్ కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారులుగా నవీన్ కుమార్, సంజయ్ వ్యవహరించారు. ఎన్నికైన సభ్యులకు ట్రైనీ కలెక్టర్ సలోని నియామక పత్రాలు అందజేశారు.