రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా వేలాది మంది అనంతపురంలో కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న బహిరంగ సభకు తరలి వచ్చేలా చూడాలని కార్యకర్తలకు మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రభుత్వ విప్ కాలవశ్రీనివాసులు పిలుపునిచ్చారు. మంగళవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో పట్టణ, రూరల్ కార్యకర్తలతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని తెలియచెబుతూ జనాన్ని తరలించాలని కోరారు.