శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో కూటమి పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్త రమేశ్పై జిల్లా ఎస్పీ రత్నకు ఫిర్యాదు చేశారు. శనివారం సాయంత్రం టీడీపీ జిల్లా కార్యదర్శి సామకోటి ఆదినారాయణ మాట్లాడుతూ.. రమేశ్ కూటమి ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని, ఆయనపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరమన్నారు. సామాజిక మాధ్య మాలలో తనకు చెయ్యి లేదని పింఛన్ తీసేశారని అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు.