తిరుపతి జిల్లా నాయుడుపేట టౌన్ లో కొందరు చిన్న పిల్లలు చదువునే వయస్సులో డబ్బులు అడుకొంటున్నారు. గురువారం పట్టణంలో దసరా పండుగ వేళ దుకాణాల వద్ద పలువురు చిన్నారులు భిక్షాటన చేస్తుండగా కనిపించారు. వారిని ఫోటో తీయబోగా పరిగెత్తారు. అయితే ఈ విధంగా భిక్షాటన వారి తల్లిదండ్రులకు తెలిసి చేస్తున్నారా లేక ఎవరన్నా చేస్తున్నారా, లేదా ఇంకేమైనా కారణాలతో బిక్షాటన చేస్తున్నారా అన్నది స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వయసులోనే ఆత్మ అభిమానాన్ని చంపుకొని అడుక్కోవడం చేస్తుంటే పిల్లల భవిష్యత్తు ఎలా ఉంటుందని పలువురు స్థానికులు విచారం వ్యక్తం చేశారు. ఇలా భిక్షాటన చేస్తున్న చిన్నారులు వెనక ఎవ