Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 22, 2025
పల్లెల్లో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ - తెలంగాణ ఆధ్వర్యంలో పల్లెల్లో పనుల జాతర కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు శుక్రవారం రోజు భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాల్లోని వివిధ గ్రామాల్లో నిర్వహించిన పనుల జాతర కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా రేగొండ మండలం గడిపల్లి గ్రామంలో రూ.12 లక్షలతో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడీ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్