కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం నుండి యెడతేరిపి లేకుండా వర్షం కురిసింది.దీంతో తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం బొమ్మలకుంట చెరువు తెగి 50 ఎకరాల వరి పంట నీట మునగడంతో రైతులు కన్నీరు పెడుతున్నారు.గత సంవత్సరంలో బొమ్మలకుంట కట్ట తెగినప్పటికీ నామమాత్రం మరమ్మతులు చేయడం వల్లే కుంట తెగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గొల్లపల్లిలో తెగిన బొమ్మల కుంట చెరువును ఎమ్మార్వో కర్ర శ్రీనివాస్ రెడ్డి,ఏఈ సాయి శ్రీ, శ్రీకాంత్ ,కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు.