ఏజెన్సీలోని ఏటూరునాగారం, మంగపేట, కన్నాయిగూడెం మండలాల్లో వినాయక చవితి సందర్భంగా మండపాల్లో విగ్రహాలు కొలువుదిరాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ ప్రాంతాలకు విగ్రహాల తరలింపు కొనసాగింది. ఇందులో భాగంగా ఏటూరునాగారంలో భారీ వర్షం కురవడంతో విగ్రహాలు తరలిస్తున్న క్రమంలో ఉత్సవ కమిటీని నిర్వహకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.