అనంతపురం జిల్లాకు చెందిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంఘ తేజస్విని కారుపై అల్లరి మూకలు రాళ్లతో దాడి చేసి గాయపరిచిన సంఘటన చోటుచేసుకుంది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా కేంద్రంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం అత్యంత విజయవంతం అవుతున్న నేపథ్యంలో ఓర్వలేక తన వాహనంపై దాడికి పాల్పడినట్లుగా బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.