కొత్తకోట మండలం పామాపురం గ్రామం, పెబ్బేరు మండలం పాతపల్లె గ్రామాల్లో గత ప్రభుత్వ హయంలో మంజూరు అయి అసంపూర్తిగా మిగిలిపోయిన రెండు పడకల ఇళ్ల నిర్మాణ పనులను జిల్లా కలక్టర్ మంగళవారం ఉదయం 11 గంటలకు పరిశీలించారు. పామపురం గ్రామంలో నాలుగు సంవత్సరాల క్రితం 56 రెండు పడకల ఇళ్ళు మంజూరు కాగా అవి పూర్తి అయి లబ్ధిదారులకు కేటాయింపులు పూర్తి అయ్యాయి. ఇంకొందరికి అవసరమని గ్రామస్తులు పట్టుబట్టి ఎన్నికల ముందు మరో 25 ఇళ్ళు మంజూరు చేయించుకున్నారు. వాటిలో ప్రస్తుతం కొన్ని రూఫ్ లెవల్, బెస్మెట్ లెవల్, కొన్ని ఫైనల్ స్టేజికి వచ్చాయని పంచాయతీ రాజ్ కార్యనిర్వహక ఇంజనీరు మల్లయ్య