గడ్డి విత్తనాలు సబ్సిడీపై రైతులు పొందేందుకు రైతు సేవ కేంద్రాలను సంప్రదించాలని రాచర్ల మండలం అనుమలవీడు పశువైద్య శాఖ అధికారి నాగమణి తెలిపారు. రైతులు తమ పశువుల మేత కోసం ప్రభుత్వం అందించే గడ్డి విత్తనాలను సబ్సిడీపై పొందవచ్చని శనివారం మధ్యాహ్నం ఒంటిగంటకు వెల్లడించారు. 5 కేజీల విత్తనాల ప్యాకెట్ కేవలం రూ.89.53 రూపాయలు మాత్రమేనని ప్రభుత్వం 70% రాయితీతో ఈ విత్తనాలు అందిస్తున్నట్లు వెల్లడించారు. రైతులు పశువుల కాపర్లు మీ స్థానిక రైతు సేవ కేంద్రాలలో గడ్డి విత్తనాలు పొందవచ్చు అన్నారు.