పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలో ఎడతెరిపి వర్షాల కారణంగా రైతులు సాగుచేసిన పంట పొలాలపై ఆందోళన చెందకుండా వ్యవసాయధికారి అక్బర్ బాషా శుక్రవారం పలు సూచనలు చేశారు.వర్షం ఆగాక పంట పొలాల్లో లేరు నిల్వ ఉండరాదఅన్నారు. మొక్క, ఆకు ఆరోగ్యంగా ఉండడానికి 10గ్రాముల యూరియా లేదా పొటాషియం లీటర్కు5 గ్రాములు కలిపి పిచికారీ చేయాలన్నారు. తెగుళ్లనివారణకు లీటర్ నీటికి కాపర్ ఆప్షన్ 3 గ్రాములు లేదామాంకోజోమ్ 2 గ్రాములు పిచికారి చేయాలన్నారు.