గ్యాంగ్ వార్ కేసులో నిందితులు కోర్టు వాయిదాలకు హాజరు అవ్వకపోవడంతో కేసు ముందు సాగట్లేదు అని సెంట్రల్ ఏసిపి దామోదర్ అన్నారు. సోమవారం ఆటోనగర్లో గ్యాంగ్ వార్ కేసులోని నిందితులకు సెంట్రల్ జోన్ ఏసీపీ దామోదర్, గన్నవరం డిఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కౌన్సిలింగ్ నిర్వహించారు. ఏసీపీ దామోదర్ మాట్లాడుతూ గ్యాంగ్ వార్ కేసు కు సంబంధించి వాయిదాలకు అందరూ హాజరు అవ్వాలని, లేదంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొని అల్లర్లు అల్లర్లు స్పష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.