Bhupalpalle, Jaya Shankar Bhalupally | Aug 29, 2025
భూపాలపల్లి మున్సిపాలిటీ జిల్లాకేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో జరుగుతున్న క్రమ సెల్లార్ నిర్మాణాలపై మున్సిపల్ శాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, కాకతీయ ప్రెస్ క్లబ్ ఆవరణలో శుక్రవారం ఉదయం 10:30 గంటలకు మీడియా సమావేశంలో తెలిపారు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుడు బుర్ర సాగర్ .ఈసందర్భంగా మాట్లాడుతూ సెల్లార్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేకుండా మున్సిపల్ శాఖ అధికారుల అనుమతితో సెల్లార్లు నిర్మిస్తున్నారని,దీంతో రానున్న రోజుల్లో భూపాలపల్లి సింగరేణి ప్రాంతం కావడంతో ప్రమాదాలు సంబంధించి ప్రజలుచనిపోయే అవకాశం ఉందని వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.