విశాఖ నగరాన్ని తిలకించడానికి వచ్చే అతిధులకు చక్కని వసతిని కల్పించడం కొరకు అన్ని హంగులతో కూడిన హోటల్ నగరంలో ప్రారంభమైంది. అల్లిపురం కెప్టెన్ రామారావు జంక్షన్ లో నెలకొల్పిన ప్రైవేట్ హోటల్ ను మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా హోటల్లోని వసతులను పరిశీలించిన అమర్నాథ్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో మరిన్ని హోటల్స్ రావలసిన ఆవశ్యకత ఉన్నదన్నారు పర్యాటకుల, నగరవాసుల అవసరాలను తీర్చే విధంగా మరిన్ని ఏర్పాటు జరగాలని ఆయన తెలిపారు.