నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలంలోని ప్రపంచ పర్యాటక ప్రాంతమైన బెలుం గుహలను శనివారం మంత్రి జనార్ధన్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. గుహల పరిసర ప్రాంతాలు అపరిశుభ్రంగా , అస్తవ్యస్తంగా ఉండడం పై అధికారులపై మంత్రి మండిపడ్డాడు. అనంతరం ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.