కలికిరి గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహిస్తున్న స్వామిత్ర సర్వే ను ఈఓ జి.అశోక్ గురువారం పరిశీలించారు. అన్నమయ్య జిల్లా డిపిఓ ఆదేశాల మేరకు ఎంపీడీవో మహమ్మద్ రియాజుద్దీన్ సూచన మేరకు కలికిరి మేజర్ గ్రామపంచాయతీలో ఈఓ అశోక్ సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికి వెళ్లి స్వామిత్ర సర్వే ను చేపట్టారు. కలికిరి పంచాయతీలోని కొత్తపేట వీధిలో ఇంటింటికి వెళ్లి కుటుంబ సభ్యుల సమక్షంలో ఇంటి కొలతలు తీసి రికార్డులో నమోదు చేశారు. అదే విధంగా పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్యక్రమాలు ప్రతిరోజు వచ్చి చేపడుతున్నారా అని ఆరా తీశారు. త్రాగునీటి సమస్య ఏమైనా ఉందా అని అడిగి తెలుసుకున్నారు. ఈ