ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం వేస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ జబ్బార్ మియా హెచ్చరించారు. గుత్తి మున్సిపాలిటీ పరిధిలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్, సచివాలయ సిబ్బందితో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. తోపుడు బండ్లు, దుకాణం దారులు చెత్తాచెదారాన్ని రోడ్లపై పడేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.