కరీంనగర్ రూరల్ మండలం నగునూరు గ్రామంలో సోమవారం సాయంత్రం పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు రూరల్ సిఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. చొప్పదండి కి చెందిన తోడేటి మధు, ఎండి ముక్బాల్, నెరువడ్ల మధు, కన్నమల్ల కోటేష్ అనే వ్యక్తులు నగునూరులోని ఒక గదిలో పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు, వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం జరిగిందని తెలిపారు. వారి వద్ద నుంచి 41,360 రూపాయలతో పాటు ఒక కారు, ఒక ద్విచక్ర వాహనం దినం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతున్న నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.