భారీ వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళంలోని పెద్దపాడు జాతీయ రహదారిపై నీరు నిలవడంతో వందల సంఖ్యలో వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. ఆర్అండ్బి అధికారులు జేసీబీ సాయంతో నీటి ప్రవాహాన్ని మళ్లించినప్పటికీ ట్రాఫిక్ క్లియర్ కాలేదు. చివరికి సర్వీస్ రోడ్డు వైపు వాహనాలను మళ్లించారు.