ఎలక్ట్రికల్ బైక్ పేలి ఒక మహిళ అక్కడికక్కడే దుర్మరణం పాలైన సంఘటన కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామంలో చోటుచేస్తుంది. ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామానికి చెందిన వెంకట లక్ష్మమ్మ అనే మహిళ ఇంటిలోని వరండాలో ఎలక్ట్రికల్ బైక్ కు ఛార్జింగ్ పెట్టి పక్కనే ఉన్న సోఫాలో నిద్రిస్తున్న సమయంలో శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఎలక్ట్రికల్ బైక్ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో పేలిపోయింది. దీంతో పక్కనే నిద్రిస్తున్న వెంకట లక్ష్మమ్మ పూర్తిగా కాలిపోయి అక్కడికక్కడే మృత్యువాత పడింది . సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రికి మార్చర