కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుచిత్ర, గండి మైసమ్మ, కుత్బుల్లాపూర్, సూరారం, చింతల్, ఐడిపిఎల్, కొంపల్లి, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతి నగర్ వంటి పలు ప్రాంతాలు ఏడబుతి లేకుండా కురుస్తున్న వర్షంతో అతలాకుతలమయ్యాయి. భారీ వర్షం కారణంగా ప్రజలు బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. బుధవారం వినాయక చవితి పండుగ సందర్భంగా, మార్కెట్లకు వెళ్లి పూజ సామాగ్రి కొనుగోలు చేయాల్సిన స్థానిక ప్రజలు వర్షం కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.