భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ మరియు జిల్లా కేంద్రంలోని గణపతి మండపాల్లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు వినాయక పూజలో పాల్గొన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు. ఈక్రమంలో అర్చకులు పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ గణపతి దేవుని దయవల్ల ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, నియోజకవర్గ అభివృద్ధికి గణపతి దేవుడు సహకరించాలని కోరుకున్నట్లు తెలిపారు.నిమజ్జనం నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ నిమజ్జన కార్యక్రమం నిర్వహించుకోవాలన్నారు ఎమ్మెల్యే గండ్ర.