కౌటాల మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి నాయకులు సోమవారం రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టుపై విషం చిమ్ముతూ అసత్య ప్రచారం చేస్తుందని ఆరోపిస్తూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన మేరకు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదని నాయకులు కాంగ్రెస్, బిజెపి ప్రభుత్వాలను హెచ్చరించారు,