నేటి రాజకీయ నాయకులు తమ ప్రసంగాలలో బూతులు తిట్టడం మానుకోవాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. సంగారెడ్డిలో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో పాక రాజమౌళి రచించిన భావ తరంగాలు పుస్తకాన్ని మెదక్ ఎంపీ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భావతరంగాలు పుస్తకాన్ని తాను పూర్తిగా చదివి మునుముందు ప్రసంగాలలో ఉపయోగిస్తానని స్పష్టం చేశారు.