Udayagiri, Sri Potti Sriramulu Nellore | Sep 10, 2025
ప్రస్తుతం ప్రబలుతున్న సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉదయగిరి ప్రభుత్వ CHC వైద్యాధికారి సిద్ధాశివరాం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వాతావరణంలో వచ్చిన మార్పుల వల్ల జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు లాంటి లక్షణాలు ఎక్కువ మందిలో కనిపిస్తున్నాయన్నారు. వీటికి డాక్టర్ సూచన మేరకే మందులు వాడాలని సొంత వైద్యం చేసుకోకూడదని సూచించారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు వైద్యులు పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు